నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణ అభివృద్ధికి పనులు చేపట్టాలని, గత కొంతకాలంగా పేరుకుపోయిన ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ చైర్మన్ బీజని బాలమణి భాస్కర్, మున్సిపాలిటీ మేనేజర్ జగన్ మోహన్ లకి వినతి పత్రం అందజేశారు.
ఆలేరు పట్టణంలో ఉండే ప్రధాన సమస్యలు కొలనుపాక రోడ్డుపై ఉన్న మున్సిపల్ కార్యాలయ బిల్డింగ్ నిర్మాణం, మెయిన్ రోడ్ పై మున్సిపల్ మడి గెల నిర్మాణము, ఆలేరులో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు, ఆలేరులో ముఖ్యమైన ప్రాంతాల్లో స్మశాన వాటికలు నిర్మాణం, మెయిన్ రోడ్ పై డివైడర్ల నిర్మాణం ,ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని, మున్సిపాలిటీ చైర్మన్ బీజని బాలమని భాస్కర్, మేనేజర్ జగన్మోహన్లను వినతిలో కోరారు. చైర్మన్ చాంబర్లో ఆలేరు అభివృద్ధి కోసం ప్రధాన సమస్యల మీద చర్చించారు. దీనిమీద చైర్మన్ బిజన్ బాలమణి సానుకూలంగా స్పందించారు.
ఆలేరు పట్టణ అభివృద్ధి కొరకు అఖిలపక్ష కమిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సభ్యులు ముక్తకంఠంతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం, కోకన్వీనర్ చెక్క వెంకటేష్, మాజీ సింగిల్విండో చైర్మన్ , మొరిగాడి చంద్ర శేఖర్, పుట్ట మల్లేష్ , వడ్డేమాన్ నరేందర్, కంతుల శంకర్, కేమిడి ఉప్పలయ్య , జూకంటి పౌల్,సముద్రాల సత్యం, బాంబే రవి,యేలుగల కుమారస్వామి, మంచన మల్లేశం, నమిలే అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.



