నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ నుంచి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జె.పి. నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్ వంటి ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది.
ఈ అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా నిర్వహించడానికి అన్ని పక్షాల సహకారాన్ని కోరనున్నారు. అలాగే ముఖ్యమైన బిల్లులు (వక్ఫ్ సవరణ బిల్లు, ఒక దేశం-ఒకే ఎన్నిక బిల్లు వంటివి), రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26), మణిపూర్ అల్లర్లు, అదానీ వ్యవహారం, చైనా సరిహద్దు సమస్యలు వంటి అంశాలపై ఇందులో చర్చిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపట్నుంచి వచ్చే నెల ఆగష్టు 21 వరకు వర్షకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.