నవతెలంగాణ – మిరుదొడ్డి
అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జుహార్ ఖాన్ అధ్యక్షతన జడ్పిటిసి, ఎంపీటీసీ ఎలక్షన్ల నిర్వహణ పైన ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులతోటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించి నాయకుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. మండలంలో ఒక్క జెడ్పిటిసి,తొమ్మిది ఎంపిటిసి స్థానాలు ఉన్నాయని తెలిపారు.మండలంలో మొత్తం 44 బూతులు ఉన్నాయని తెలిపారు.
బూత్ వారిగా ఓటర్ల యొక్క వివరాలు నమోదు చేయబడిందని తెలిపారు. మండలంలో మొత్తం ఓటర్లు 24 వేల 39 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని పార్టీ నాయకులు సహకరించాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతురి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవర మైపాల్ యాదవ్, ఎంపీఓ బాలాజీ, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ మరియు వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.