Wednesday, April 1, 2026
E-PAPER
Homeసినిమామనుషులంతా ఒక్కటే..

మనుషులంతా ఒక్కటే..

- Advertisement -

ఔరో టొవినో థామస్‌ నటించిన మూవీ ‘పళ్లిచట్టంబి’. వరల్డ్‌ వైడ్‌ ఫిలింస్‌, సి క్యూబ్‌ బ్రోస్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్స్‌ పై నౌఫల్‌, బ్రిజీష్‌, చాణుక్య చైతన్య చరణ్‌ నిర్మిస్తున్నారు.
డిజో జోస్‌ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది.
ఈ మూవీ ఈనెల 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రానుంది.
ఈ నేపథ్యంలో ఈచిత్ర రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ప్రొడ్యూసర్స్‌ మాట్లాడుతూ, ‘మా మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డైరెక్టర్‌ డిజో అందరికీ నచ్చేలా సినిమా తెరకెక్కించాడు. మరికొద్ది రోజుల్లోనే మా మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకోబోతున్నాం’ అని తెలిపారు. ‘సినిమా టెక్నికల్‌ చాలా క్వాలిటీగా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్‌కు ఒక కొత్త కమర్షియల్‌ మూవీ అవుతుంది. మాతో ట్రావెల్‌ అయిన మేఘశ్యామ్‌ ఈ సినిమాకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది’ అని ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ బన్నీ వాస్‌ చెప్పారు.
‘నేను డైరెక్ట్‌ చేసి నాలుగో చిత్రమిది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అయ్యే సింపుల్‌ స్టోరీ ఇది. మనుషులంతా ఒక్కటే అనేది ఈ మూవీ ప్రధాన కథాంశం’ అని డైరెక్టర్‌ డిజో జోస్‌ ఆంటోనీ చెప్పారు. హీరో టొవినో థామస్‌ మాట్లాడుతూ, ’50వ దశకం నేపథ్యంగా సాగే చిత్రమిది. ఈనెల 10వ తేదీ నుంచి ఈ సినిమా మనందరి మూవీ కాబోతోంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -