Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి: షబ్బీర్ అలీ

ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి: షబ్బీర్ అలీ

- Advertisement -

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్  అలీ
నవతెలంగాణ – కామారెడ్డి
: కామారెడ్డి కోర్ట్ ఆవరణ ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం నమాజ్ చేసి కామారెడ్డి పట్టణ, నియోజకవర్గ, జిల్లా ప్రజలకు ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్  షబ్బీర్ అలీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ అని, త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్‌ పండుగ విశ్వమానవాళికి అందిస్తున్నదన్నారు. బక్రీద్‌ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ  రాష్ట్రంలో, దేశంలో పాలన కొనసాగాలని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకుంటూ  అందరూ  ఆయురారోగ్యాలతో  ఉండాలని అల్లాతో ప్రార్థించానని అన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img