Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
– ముందుస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో వైఫల్యం 
– ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం చోద్యం చూసింది
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు గోదావరి వద్దకు వెళ్లొద్దని, జిల్లా అన్ని శాఖల అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.గత రెండు మూడు రోజులుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన తీవ్రమైన పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు మనందరం చూస్తున్నామన్నారు.

కామారెడ్డి జిల్లాలో కురసిన వర్షాల వల్ల నిజాంసాగర్ పూర్తి స్థాయిలో నిండి సుమారు 2 లక్షల పై చిలుకు వరద నీరు మంజీరా ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వస్తుందని తెలిపారు నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి 2.50 లక్షల క్యూసెక్కులకు పైగా వరదను గోదావరి లోకి వదులుతున్నారని పేర్కొన్నారు.శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి ఇంకా వరద పెరిగే అవకశాలు ఉన్నందున గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు.ప్రజలు గోదావరి వెంబడి వెళ్ళకూడదని, గట్టు వెంబడి ఏమైనా మోటార్లు ఉంటే ముందే తీసుకోవాలని సూచించారుచెరువులు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉంటుంది.

కావున ప్రజలు చెరువులు కుంటలు చూడటానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అటువైపు వెళ్ళకూడదన్నారు.బాల్కొండ నియోజకవర్గంలోని కప్పల వాగు, పెద్దవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.జిల్లా అధికార యంత్రాంగం నుండి గ్రామీణ స్థాయి వరకు రెవెన్యూ, ఎలెక్ట్రీసిటీ, ఇరిగేషన్, అన్ని శాఖల అధికారులు సామన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఏమ్మల్యే కోరారు.లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడిక క్కడ అందుబాటులో ఉంటు లోతట్టు ప్రాంతాల్లో అవసరమున్నచోట ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

అవసరమైతే వారికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలనీ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.గత రెండు మూడు రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుసిన భారీ వర్షం నేపథ్యంలో అక్కడ ఏర్పడిన తీవ్ర ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.వర్షాలు కురుస్తున్నప్పుడు ముందుస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వైఫల్యం చెందిందని, ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం చోద్యం చూసిందని విమర్శించారు.ఇకనైనా నిజామాబాద్ జిల్లాలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad