Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ : మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ : మంత్రి హరీష్ రావు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలు బంద్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌లో.. “సన్నాలకు బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్యాస్ బండకు రాయితీ, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయి. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవు. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు.

పాలన అంటే ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు తీర్చుకోవడం కాదని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టాడు. కానీ ప్రస్తుతం గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డిడి పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాటలు విని విని విసిగి పోయిన యాదవ, కురుమ సోదరులు గాంధీ భవన్‌కు గొర్రెలు తోలుకొని వచ్చి నిరసన తెలియచేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని గుర్తించి, అన్ని వర్గాల ప్రజలు ఏకమై గాంధీ భవన్ కు పోటెత్తకముందే కళ్లు తెరవాలని, చెప్పిన గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు ఇకనైనా అమలు చేయకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా మాజీ మంత్రి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad