శ్రామిక వర్గ హక్కుల సారధి – ఉద్యమాల వారది సిఐటియుని ఆదరించండి
అక్టోబర్ 29,30 తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరణ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఈనెల 29 30 తేదీలలో సిరిసిల్లలో జరిగే సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలను అన్ని వర్గాలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ పేర్కొన్నారు. సిరిసిల్లలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కరపత్రాలు ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో కార్మిక వర్గం , కష్టజీవులు ఎదుర్కొంటున్న సమస్యలు అదేవిధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై , పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పక్షాన నిలబడి అనేక సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని అన్నారు.
కార్మిక వర్గ ఐక్యతను చాటే విధంగా వేలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ – ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇ మహాసభలకు సిఐటియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారని ఇ మహాసభలలో గత మహాసభ నుండి ఇప్పటివరకు మూడు సంవత్సరాల కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాలు ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్ పోరాట కార్యచరణ రూపొందించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని ఇ మహాసభలలో జిల్లాలోని పవర్లూమ్ కార్మికులు , బీడీ కార్మికులు , హమాలీ కార్మికులు , భవన నిర్మాణ కార్మికులు , గ్రామపంచాయతీ మున్సిపల్ , ఆశా , అంగన్వాడి , మధ్యాహ్న భోజనం , హాస్పిటల్ ఇతర అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ మహాసభల నిర్వహణ మరియు రాబోయే రోజుల్లో నిర్వహించబోయే ఉద్యమ పోరాటాల కొరకు జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు , మిత్రులు శ్రేయోభిలాషులు , ఉద్యోగ ఉపాధ్యాయులు , వాణిజ్య వ్యాపారస్తులు , ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక, హార్థిక సహాయ సహకారాలు అందించి ఉద్యమాల సారథి , పోరాటాల వారది సిఐటియుకు అండదండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ మూషం రమేష్ , గుర్రం అశోక్ , అన్నల్దాస్ గణేష్ , గురజాల శ్రీధర్ , సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు.
సిఐటియు మహాసభల విజయవంతానికి అన్ని వర్గాలు సహకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES