Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంనిందితులంతా నిర్దోషులే

నిందితులంతా నిర్దోషులే

- Advertisement -

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు
ముంబయి :
2008 మాలేెగావ్‌ పేలుళ్ల కేసులో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్‌ సహా ఏడుగురు నిందితులను ముంబయి ప్రత్యేక కోర్టు గురువారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని, కేవలం సందేహం సరిపోదని ప్రత్యేక ఎన్‌ఐఏకోర్టు పేర్కొంది. పేలుడు జరిగిందని ప్రాసిక్యూషన్‌ విజయవంతంగా నిరూపించిందని, అయితే మోటార్‌బైక్‌లో బాంబు అమర్చినట్టు నిర్థారించడంలో ఎన్‌ఐఏ విఫలమైందని ప్రత్యేక జడ్జి ఎ.కె.లహోటి తీర్పు వెలువరించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) నిబంధనలు ఈ కేసుకు వర్తించవని అన్నారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో రంజాన్‌ నెలలో 2008 సెప్టెంబర్‌ 29న బిక్కుచౌక్‌ సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, వందలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే.
నిందితులపై ఉపా సహా, ఐపీసీలోని హత్య, కుట్ర, హత్యాయత్నం, శతృత్వాన్ని ప్రోత్సహించడం, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును మొదట హేమంత్‌ కర్కరే నేతృత్వంలోని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) చేపట్టింది. ఆ సమయంలో పలువురి వాంగ్మూలాలను నమోదు చేసింది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో ఆయన మరణించారు. తర్వాత ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -