- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26.55 కోట్ల బడ్జెట్తో అధునాతన వసతులతో నిర్మించిన బేగంపేట రైల్వే స్టేషన్ ఈరోజు ప్రారంభంకానుంది. ఉదయం 9.30లకు ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. అయితే, బేగంపేటలో స్టేషన్ మాస్టర్ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అంతా మహిళా ఉద్యోగులే ఉండటం విశేషం. మెట్రో మాదిరిగా దివ్యాంగులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- Advertisement -