నవతెలంగాణ – కాటారం
గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాలలో నిధులను మంజూరు చేస్తాయి. ప్రజా సంక్షేమానికి పలు పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. అయితే తమ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చాయి, ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారన్న వివరాలు చాలామందికి తెలియదు. ఆయా సమాచారం అంతా ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయత్ పేరిట యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో జవాబుతనాన్ని పెంచడంతో పాటు ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించారు. గ్రామ పంచాయితీల ఆదాయ, వ్యాయాలు, ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు ఖర్చులు తీరు, తదితర వివరాలన్నీ అరచేతి నుంచే తెలుసుకునే ఎసలు బాటు ఉంది. నిర్దేశించిన ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందా, నిధులను మరోచోట వినియోగిస్తున్నారా అన్నది జీపీఎస్ విధానం ద్వారా తెలుసుకోవచ్చు.
పనులు ఏ దశలో ఉన్నాయి,ఏ పనికి ఎంత ఖర్చు చేశారన్న ఈ గుర్తించవచ్చు. గ్రామ సభల్లో రూపొందించిన నివేదికలు, తీర్మానాలను సైతం ఇందులో పొంద పరుస్తారు అధికారులు తప్పుడు నివేదికలు రూపొందించినట్లు గుర్తిస్తే ఆధారాలతో సహా ప్రశ్నించే వీలుంటుంది. అవకతవకలు జరిగితే ఫిర్యాదు సైతం చేయవచ్చు. అధునాతన చరవాణిలో ప్లే స్టోర్ నుంచి మేరీ పంచాయత్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ తో లాగిన్ కావాలి రాష్ట్రం జిల్లా మండలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీల వివరాలు కనిపిస్తాయి అందులో మన ఊరిని ఎన్నుకుంటే సమగ్ర సమాచారం ప్రత్యక్షమవుతుంది.
గ్రామ పంచాయతీల సమాచారం అంతా చరవాణిలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES