• కాంగ్రెస్ బోగస్ హామీలిచ్చింది
• బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడాలి
• మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ -పెద్దవంగర
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చిన కేసీఆరే ముఖ్యమంత్రి అని, సర్వేలన్ని బీఆర్ఎస్ వైపే అనుకూలంగా ఉన్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అధ్యక్షతన మండల కేంద్రంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రబెల్లి స్థానిక సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ తో కలిసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలోని రైతులకు యూరియా కొరత ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతూన్నారని ఆరోపించారు.
బోగస్ హామీలతో ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఇంచార్జి రంగు కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరి రావు, నాయకులు సమ్మయ్య, సుధాకర్, రఘు, జ్ఞానేశ్వర్ చారి, విజయ శ్రీనివాస్, వెంకన్న, పటేల్, రాజేందర్, షర్ఫుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.



