Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగుడికి అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సాయం

దివ్యాంగుడికి అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ – గీసుగొండ
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజాసేవలో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన అల్లం బాలకిషోర్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గీసుగొండ మండలం ఊకల్ (హ) గ్రామానికి చెందిన దివ్యాంగుడు మండల కుమార్‌కు రూ..10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

శారీరక వైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండల కుమార్ పరిస్థితిని తెలుసుకున్న అల్లం బాలకిషోర్ రెడ్డి వెంటనే స్పందించి తక్షణ సాయంగా ఈ మొత్తాన్ని అందించారు. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన సేవా దృక్పథాన్ని గ్రామస్తులు, యువకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మనుగొండ గ్రామ ఉపసర్పంచ్ ఏంబాడీ సాంబరాజ్యం శంకర్, మాదాసి రాంబాబు, తుప్పరి వికాస్, చాపర్తి కనకయ్య, ఏంబాడీ మధు, శంకర్, జావిద్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -