- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని పొన్కల్ పిఎసిఎస్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న అల్లం రవి, ఉత్తమ పిఎసిఎస్ చైర్మన్గా అవార్డు దక్కించుకున్నారు. 72వ ఆల్ ఇండియా కోపరేటివ్ సహకార వారోత్సవాల్లో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పిఎసిఎస్ అవార్డును ప్రిన్సిపల్ డిసిబిసి చైర్మన్ బుక్య వెంకన్న, డి సి ఓ సంజీవరెడ్డి ఎండి అన్నపూర్ణ చేతుల మీదుగా అవార్డును తీసుకున్నారు. సందర్భంగా అల్లం రవి మాట్లాడుతూ.. రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ఎరువులు విత్తనాలు అందించడంలో రైతులకు సహకరించినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డుతో రైతులకు మరింత మేలు చేయటానికి తనపై మరింత బాధ్యత పెరిగింది అన్నారు. సీఈఓ రాజన్న అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



