Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రజల్లో వ్యతిరేకతను జీర్ణించుకోలేకే ఎమ్మెల్యేపై ఆరోపణలు

ప్రజల్లో వ్యతిరేకతను జీర్ణించుకోలేకే ఎమ్మెల్యేపై ఆరోపణలు

- Advertisement -

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్
హామీల అమలు కోసం ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను జీవించుకోలేక కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో దేవేందర్ మాట్లాడారు.ఎన్నికలకు ముందు ఆనాటి పీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారులకు వస్తే అన్ని డబ్బులు చేస్తామని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కుంటి సాకులు చెబుతూ ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ప్రజల్లో వ్యతిరేకతను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులపై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లిబుచ్చుతున్నారని ఆరోపించారు. గత పది సంవత్సరాలలో రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి బాల్కొండ ప్రజల మన్ననాలు పొందాడన్నారు. ప్రజలు ప్రశాంత్ రెడ్డి పాలనను మెచ్చి హైట్రిక్ విజయాన్ని అందించారనే కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజల తరఫున, రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలతో ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగున నిలదీస్తూనే ఉంటామన్నారు. ఈ సమావేశంలో చౌటుపల్లి సింగిల్ విండో చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, బిఆర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, పాలెపు రవి కిరణ్, సంత రాజేశ్వర్, నోముల నరేందర్, గోపిడి లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -