Wednesday, January 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్యేపై ఆరోపణలు.. జనసేన కీలక నిర్ణయం

ఎమ్మెల్యేపై ఆరోపణలు.. జనసేన కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జనసేనకు చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. ఓ మహిళ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యేపై విచారణ చేయాలని జనసేన నిర్ణయించింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో టి.శివశంకర్‌, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి.వరుణ్‌ ఉన్నారు. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్‌ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెల్లడయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను జనసేన ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -