Friday, May 16, 2025
Homeరాష్ట్రీయంసిరికొండ పీహెచ్‌సీ సిబ్బంది గైర్హాజరుపై ఆరోపణలు

సిరికొండ పీహెచ్‌సీ సిబ్బంది గైర్హాజరుపై ఆరోపణలు

- Advertisement -

– విచారణకు మంత్రి దామోదర ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నిజామాబాద్‌ జిల్లా సిరికొండ పీహెచ్‌సీలో సిబ్బంది విధులకు గైర్హాజరవుతున్నట్టు వస్తున్న ఆరోపణలపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందించారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారితో విచారణ చేయించాలని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవిందర్‌ నాయక్‌ను మంత్రి ఆదేశించారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరికొండ పీహెచ్‌సీ వ్యవహారం గురించి డీఎంహెచ్‌వోకు కనీస సమాచారం లేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు ఆఫీసులకే పరిమితమైతే, క్షేత్రస్థాయిలో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయని డీహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని మంత్రి ఆదేశించారు. విధులకు డుమ్మా కొడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు, హాజరు విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -