- Advertisement -
హైదరాబాద్ : అలెన్ వరల్డ్ జూనియర్ 10కె రన్ ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహంగా సాగింది. 180కి పైగా స్కూల్స్ నుంచి 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ రన్‌ను భారత స్టార్ అథ్లెట్ అగసర నందిని జెండా ఊపి ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియంలో మొదలైన 10కె రన్ టిమ్స్ గేటు నుంచి గోపీచంద్ అకాడమీ, ఐఎస్‌బి సర్కిల్ మీదుగా తిరిగి స్టేడియంలో ముగిసింది. 1కె రన్‌లో పిల్లలతో పాటు తల్లిదండ్రులు సైతం ఉల్లాసంగా పాల్గొన్నారు. 1కె, 3కె, 5కె, 10కె రన్ విభాగాల్లో కలిపి రూ. 3 లక్షల నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో స్పాట్‌ఆన్ స్పోర్ట్స్, అలెన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
- Advertisement -



