Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్‌ కేటాయించండి ఆర్థికశాఖ కార్యదర్శికి టీఎన్జీవోస్‌ వినతి

బడ్జెట్‌ కేటాయించండి ఆర్థికశాఖ కార్యదర్శికి టీఎన్జీవోస్‌ వినతి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే బడ్జెట్‌లో పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, ఈహెచ్‌ఎస్‌, పెండింగ్‌ బిల్లులతో పాటు, ఒపీఎస్‌ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం కోరింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ సచివాలయంలో ఆ సంఘం నాయకులు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాను కలిసి వినతిపత్రం సమర్పించారు. సుల్తానియాను కలిసిన వారిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం.హుస్సేనీ ముజీబ్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కస్తూరి వెంకట్‌, క్లాస్‌ 4 అసోసియేషన్‌ నాయకులు ఖాదర్‌ బిన్‌ హసన్‌, క్లాస్‌ 4 పెన్షనర్స్‌ నాయకులు గడ్డం జ్ఞానేశ్వర్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -