Thursday, June 12, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కొత్త మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు..సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం

కొత్త మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు..సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్‌ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్‌ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీలో రేవంత్‌ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్‌ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను అని చెప్పుకొచ్చారు.
కేసీఆర్‌ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్నదంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. ​కేటీఆర్‌ చెప్పినట్టే కిషన్‌రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేద‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -