Friday, March 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి

బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెంచాలి

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2026-27) లో విద్యారంగానికి మొండిచేయి అని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ 3,24,234 లక్షల కోట్లలో విద్యారంగానికి కేవలం 26,674 కోట్లు ( 8.2 శాతం) మాత్రమే కేటాయించటం అంటే విద్యారంగాన్ని విస్మరించటమే అని ,విద్యా కమిషన్ సూచించిన 18% నిధుల ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టిందని,విద్యారంగ అభివృద్ధికి కనీసం రాష్ట్ర బడ్జెట్ లో 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రూ.8500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వారి ప్రస్తావన లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -