మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల బాధ్యతలు అప్పగింత
నవతెలంగాణ-హైదరబాద్‌బ్యూరో
రాష్ట్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహ్మద్ అజహరుద్దీన్‌కు ప్రభుత్వం శాఖల్ని కేటాయించింది. ఆయనకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల్ని కేటాయించారు. అజహరుద్దీన్ గత నెల 31న రాష్ట్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమశాఖ బాధ్యతల్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహిస్తున్నారు. ఆయనకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా ఉన్నాయి. దీనితో మైనారిటీ సంక్షేమాన్ని ఆయన నుంచి తొలగించి, అజహరుద్దీన్‌కు అప్పగించారు. ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది. దాన్ని కూడా మంత్రి అజహరుద్దీన్‌కు కేటాయించారు.
మంత్రి అజహరుద్దీన్‌కు శాఖల కేటాయింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



