Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం..హాజరైన చిరంజీవి, రామ్ చరణ్

అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం..హాజరైన చిరంజీవి, రామ్ చరణ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : త్వరలో అల్లు వారింట పెండ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నటుడు అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన శిరీష్, ఈరోజు హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. అల్లు శిరీష్, నయనిక నిశ్చితార్థం వేడుక భాగ్యనగరంలోని కాబోయే వధువు నివాసంలో వేడుకగా జరిగింది.

ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇరువురూ ఉంగరాలు మార్చుకున్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ మొదలైన కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

శిరీష్, నయనిక రెడ్డి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. తెలుపు రంగు కుర్తా పైజామాలో శిరీష్, ఎరుపు రంగు శారీలో నయనికలను చూసిన నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జంట చూడముచ్చటగా ఉందని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -