కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రస్తుత బాంబే, పాట్నా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు అలోక్ ఆరాధే, విపుల్ మనుభారు పంచోలిను కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవారు నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజయం సోమవారం ఈ సిఫారసు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితాలో ఆరాధే మూడో స్థానంలోనూ, పంచోలి 19వ ర్యాంక్‌లోనూ ఉన్నారు. ఆరాధే 1964 ఏప్రిల్‌లో జన్మించారు. 2009 డిసెంబరులో మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. 2011 ఫిబ్రవరిలో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 ఆగస్టు నుంచి సుమారు మూడు నెలలు జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. తరువాత కర్ణాటక హైకోర్టుకు జడ్జీగా బదిలీ అయ్యారు. 2022 జులై నుంచి అక్టోబర్ వరకూ అక్కడ కూడా తాత్కాలిక సీజేగా పని చేశారు. 2003 జులైలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. ఈ ఏడాది జనవరి 21న బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. జస్టిస్ పంచోలి 1968 మేలో అహ్మదాబాద్‌లో జన్మించారు. 2016లో గుజరాత్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023 జులైలో పాట్నా హైకోర్టుకు బదిలీఅయ్యారు. ఈ ఏడాది జులై 21న దాని ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టు జడ్జీలుగా అలోక్ ఆరాధే, విపుల్ పంచోలి
- Advertisement -
- Advertisement -