ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడాలి: ఎంఈఓ దామాల పుల్లయ్య
ఓటమి గెలుపుకు బాటలు వేస్తుంది: బోనకల్ సర్పంచ్ బానోత్ జ్యోతి
నవతెలంగాణ – బోనకల్
విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలోనూ రాణించాలని మండల ఎంపీడీవో రురావత్ రమాదేవి కోరారు ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని మండల విద్యాశాఖ అధికారి గ్రామాల పుల్లయ్య కోరారు ఓటమి గెలుపుకు బాటలు వేస్తుందని బోనకల్ సర్పంచ్ బానోత్ జ్యోతి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో 2 ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 మండల స్థాయి పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఖో ఖో కోర్టును బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి కబడ్డీ కోర్టును కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు ప్రారంభించారు. కబడ్డీ పోటీలను ఒకవైపు ఎంపీడీవో రమాదేవి మరొకవైపు బోనకల్ సర్పంచ్ జ్యోతి కూతకు వెళ్లి పోటీలను ప్రారంభించారు.
దీంతో క్రీడాకారులలో వారు ఉత్సాహాన్ని నింపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని అటువంటి వారికి ఈ పోటీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వారు ఈ అవకాశాన సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని అప్పుడే క్రీడాకారుడు నైపుణ్యత గొప్పతనం తెలుస్తుందన్నారు. క్రీడారంగంలో రాణించగలిగిన వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు ఖో ఖో, కబడ్డీ పోటీలను,రెండవ రోజు వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మండల స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు జట్లు డివిజన్ స్థాయిలో డివిజన స్థాయిలో విజయం సాధించిన జట్లు జిల్లాస్థాయిలో ఆడవలసి ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లా స్థయి పోటీలు జిల్లా కేంద్రంలో 9 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. ఏ పోటీలోకి దిగిన ఓడిపోయినంత మాత్రాన కృంగి పోవాల్సన అవసరం లేదని అది విజయానికి బాట వేస్తుందని బానోతు జ్యోతి బోనకల్ ఉపసర్పంచ్ బానోత్ కొండ అన్నారు. పోటీ పడటం అనేది అనివార్యం అన్నారు. ఆ పోటీలో విజయం సాధించడానికి తమ శక్తి, ఇత్తులను సామర్థ్యాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న ఇటువంటి అవకాశాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
క్రీడలలో శారీరిక దారిద్యం శారీరక పటిష్టత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్ సీతానగరం సర్పంచ్ కొమ్మగిరి బిక్షమయ్య, వివిధ ఉన్నత పాఠశాలల పీడీలు ఇమ్మడిశెట్టి నారాయణ, కనకరాజు సత్యానందం, మహమ్మద్ నవీద్ పాషా, కంభం శ్రీనివాసరావు, రమాదేవి, హర్షిత, విష్ణు, వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.



