నవతెలంగాణ – కంఠేశ్వర్
బోధన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 264 గ్రా. అల్పాజోలం పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న తెలిపారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసు కు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బెలాల్ గ్రామంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముస్తాబాద్ వీరాగౌడ్ ఇంటిలో 264 గ్రా. అల్పాజోలంస్వాధీన పరుచుకొని, నిందితుడిని, నిషేధిత ఉత్ప్ర్పేరకాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్ ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించినట్లు సీఐ స్పప్న తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ ఐ లు నరసింహాచారి, బి. రామ్ కుమార్, రాజన్న, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ రామ్ బచ్చన్, గంగారాం, సాయి కుమార్లు పాల్గొన్నారు.
అల్పాజోలం పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES