- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
మండలంలోని కులాస్పూర్ గ్రామంలోనీ అంగన్వాడి కేంద్రంలో సోమవారం రోజున ఆల్ఫా జెండర్ మాత్రలను చిన్నపిల్లలకు వేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రజిత మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఈ మాత్రలు అందించాలని ఆమె గ్రామ పెద్దలకు మరియు చిన్నపిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హనుమాన్ రాజ్ మరియు గ్రామ పెద్దలు దిల్వార్ హుస్సేన్, మహిపాల్, సాయిలు గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -