- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలో భారీ వర్షాల వల్ల చెరువు, కుంటల అలుగులు తెగిపోయినవి. మంగళవారం మోడేగాం చెరువు అలుగు తెగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువు కింద ఆయకట్టు దారులు చెరువు యొక్క అలుగు తెగి పోవడం వల్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ చెరువులో నీరు ఉంటే చెరువుపైన ఉన్న రైతులకు నీటిమట్టం పెరుగుతుందని తెలిపారు. చెరువు కింద ఉన్న రైతులకు కూడా నీటిమట్టం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చెరువు యొక్క అలుగును బాగు చేయాలని కోరుతున్నారు.
- Advertisement -