- Advertisement -
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1979-1980 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రిక్కల సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థులు ఒకరికి ఒకరు కలుసుకొని సంతోషంగా పిల్లాపాపలతో గడిపారు. పూర్వ విద్యార్థుల వయస్సు 60 సంవత్సరాలు పూర్తవడంతో ఒకరికి ఒకరు సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జయపాల్ రెడ్డి ముత్యం రెడ్డి సురేందర్ భాస్కర్ గోవర్ధన్ బిక్షపతి శ్రీనివాస్ రెడ్డి అర్చన స్వరూప అనసూయ భూపాల్ రెడ్డి భగవంతు రెడ్డి చారి రాజేశ్వరి గోపాల్ సత్తిరెడ్డి రాములు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -