నవతెలంగాణ – తుర్కపల్లి
తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010 -11 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను వేదికపైకి ఆహ్వానించి, శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చాన్ని అందజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరికి ఒకరు పరిచయం చేసుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాలలో చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణమాచార్యులు, మక్సుద్దీన్, మనోజ్ కుమార్ ,మల్లేశం, చిత్తరంజన్ ,రాజు,వసంత సుజాత, గీత ,పుష్పలత, వసంత పూర్వ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES