- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక : దుబ్బాక మండల పరిధిలోని పెద్ద చీకోడ్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004- 05 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు మంగళవారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. అప్పటి హెచ్ఎం శ్రీనివాస్, గురువులు పర్శరాములు, రవి, విజయ, సంజీవరెడ్డి, రామచంద్రం, ప్రసాద్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. గురువులకు పాదాభివందనం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎండీ.షరీఫ్, భాస్కర్, ప్రసాద్, ఆంజనేయులు, స్వరూప, లావణ్య, స్రవంతి, స్వప్న, శ్రీలత పలువురు పాల్గొన్నారు.
- Advertisement -