Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ విద్యాలయం (ఆర్యసమాజ్) 2007-08 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం నిర్వహించారు. 18 ఏండ్ల తర్వాత ఒక్కచోట చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తమకు పాఠాలు బోధించిన గురువులకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మనం ఈ స్థాయి లో ఇలా ఉన్నామంటే అందుకు తల్లిదండ్రులు, గురువులు కారణమని అన్నారు. మనం ఎంత ఎదిగినా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులను మరవద్దని అన్నారు. చిన్నప్పుడు నేర్చుకున్న క్రమశిక్షణ ను పిల్లలకు నేర్పించాలని, ఫోన్ లకు దూరంగా ఉంచాలని సూచించారు. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. అంతకుముందు పూర్వ విద్యార్థులు తమను పరిచయం చేసుకొని ఆనాడు చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం గ్రూప్ ఫోటో దిగి తమ గుర్తులను మరింత పదిలపరచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -