నవతెలంగాణ – వలిగొండ రూరల్ : మండలంలోని వెలువర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999- 2000 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం పూర్వ విద్యార్థులు అంతా పాఠశాల ప్రాంగణంలో ఒకే చోట కలిసి గతం నాటి స్మృతులను నెమరు వేసుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులంతా ఒకే చోట కలవడంతో పాఠశాల ప్రాంగణం పండగ వాతావరణంలా కనిపించింది. అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించి గురుభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ గురువులు భాషేట్టి కృష్ణమూర్తి, సింహయ్య, ఎల్లయ్య, చెన్నకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, చేగూరి మల్లేశం, బిక్షపతి, కల్కూరి నరసింహ పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వెలువర్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES