Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలూర్ వాసికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

ఆలూర్ వాసికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఇంగు సాగర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ ఫిలాసఫీ విభాగం బుధవారం డాక్టరేట్ ప్రకటించింది. “ప్లేటో యొక్క మాండలిక (Dialectical) పద్ధతి – ఒక అధ్యయనం” అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను  గౌరవ డాక్టరేట్ లభించింది. ప్రఖ్యాత తత్వవేత్త ప్లేటో ప్రతిపాదించిన మాండలిక పద్ధతి తాత్విక ఆలోచనల వికాసంలో పోషించిన పాత్ర, దాని సమకాలీన ప్రాముఖ్యత, తార్కిక విశ్లేషణ వంటి అంశాలను ఇంగు సాగర్ తన పరిశోధనలో లోతుగా విశ్లేషించారు. ఈ పరిశోధన విద్యార్థులు, పరిశోధకులకు ఉపయోగకరంగా ఉండనుందని ఫిలాసఫీ విభాగం అధ్యాపకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇంగు సాగర్ నిజం డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే కొనసాగి డాక్టరేట్ స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది గ్రామీణ విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ, తన ఈ విజయానికి తల్లిదండ్రులు, గురువులు అందించిన ప్రోత్సాహం అమూల్యమని, వారి రుణాన్ని జీవితాంతం మరిచిపోలేనని తెలిపారు. అలాగే తన పరిశోధన ద్వారా తత్వశాస్త్రానికి మరింత సేవ చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.ఇంగు సాగర్‌కు డాక్టరేట్ లభించడంతో ఆలూర్ మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు, మిత్రులు, విద్యార్థులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -