Friday, July 4, 2025
E-PAPER
Homeబీజినెస్హెచ్‌ఎంఎ నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్‌ రెడ్డి

హెచ్‌ఎంఎ నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్‌ రెడ్డి

- Advertisement -

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఎ) నూతన అధ్యక్షుడిగా ఈరైడ్‌ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ వ్యవస్థాపకుడు అల్వాల దేవేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్‌ఎంఎ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఉపాధ్యక్షుడిగా శరత్‌ చంద్ర మారోజు, కార్యదర్శిగా వాసుదేవన్‌ను ఎన్నికయ్యారు. ఈ కొత్త కమిటీలో వాసు దేవన్‌, చేతనా జైన్‌, వి శ్రీనివాసరావు, అంకర వెంకట కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు. ”వివిధ పరిశ్రమలను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాము. విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఔత్సాహికవేత్తలుగా లేదా కార్పొరేట్‌ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని దేవేందర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -