– ఫోన్ కాల్ తో సమస్యకు పరిష్కారం
– ఫిర్యాదులు నమోదుకు కౌంటర్ ఏర్పాటు: కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అందుకు పిర్యాదు దారులు పురపాలక సంఘ కార్యాలయానికి రాకుండానే ఇంటివద్ద నుండే నేరుగా ఫోన్ ద్వారా తమ సమస్యను తెలియజేసేందుకు ప్రత్యేక ఫోన్ నెంబర్ తో కౌంటర్ ఏర్పాటు చేయటం జరిగిందని కమీషనర్ బి.నాగరాజు తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమస్యలపై ప్రజల సమయం వృదా కాకుండా ఉండేందుకు కార్యాలయంలో ఫోన్ నంబర్ 6309318378 తో ప్రత్యేక ఫిర్యాదులు కౌంటర్ ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా పారిశుధ్యం,త్రాగునీటి సమస్యతో పాటు వీది లైట్లు ఏర్పాటు సమస్యలపై ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు ఫోన్ లో సమస్యలను వివరిస్తే నమోదు చేసుకుని సమస్య తీవ్రతను బట్టి వారం రోజులలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పురపాలక అభివృద్ది కి సహకరించాలని కోరారు.
పుర పౌరులకు సదావకాశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES