Sunday, December 21, 2025
E-PAPER
Homeఖమ్మంనియోజక వర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో

నియోజక వర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో

- Advertisement -

– హైద్రాబాద్ లో పలు ఆస్పత్రులు సందర్శన
– అశ్వారావుపేట విలేకరి గిరి ని పరామర్శించిన ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

తన నియోజక వర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలు చూడటంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అధికారిక కార్యక్రమం అయినా,అనధికారిక వ్యవహారం అయినా,వ్యక్తిగత ప్రయాణం అయినా హైద్రాబాద్ వెళ్ళారు అంటే ఏదో ఒక ఫైల్ తోనే వెళ్తారు.పనిలో పనిగా సీఎంఆర్ఎఫ్ ఎంతమందికి రావాలి,ఎన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి ఆరా తీసి వస్తారు.

గత రెండు రోజులుగా హైద్రాబాద్ లో ఉన్న ఆయన అక్కడ పలు ఆసుపత్రుల్లో ఉన్న అశ్వారావుపేట నియోజక వర్గం రోగులను పరామర్శించారు. హృద్రోగం తో చికిత్స పొందుతున్న అశ్వారావుపేట కు చెందిన విలేకరి గిరి ని సోమవారం పరామర్శించిన ఆయన తక్షణమే సీఎంఆర్ఎఫ్ అమలు అయ్యేలా అధికారులతో మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -