- Advertisement -
బెంగళూరు : ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఫ్రెష్ సేవలను 270కి పైగా పట్టణాలకు విస్తరించినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, చిత్తూరు, విజయనగరం, తిరుపతి నగరాలు, తెలంగాణలో కొత్తగా వరంగల్, ఆదిలాబాద్ పట్టణాల్లో తమ సేవలు లభ్యం అవుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది. కేవలం రెండు సంవత్సరాల్లో 4.5 రెట్లు ఎక్కువ ప్రదేశాలకు విస్తరించామని వెల్లడించింది. తాజా పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, గృహావసర వస్తుసామాగ్రి, స్థానికంగా ప్రజలు మెచ్చిన వస్తువులతో సహా దైనందిన అవసరాలకు కావలసిన ఉత్పత్తులను లక్షలాది కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావటానికి అమెజాన్ కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమని తెలిపింది.
- Advertisement -