Thursday, October 30, 2025
E-PAPER
Homeబీజినెస్భారత్‌లో అమెజాన్‌ 1000 మందిపై వేటు

భారత్‌లో అమెజాన్‌ 1000 మందిపై వేటు

- Advertisement -

న్యూఢిల్లీ: దిగ్గజ ఇ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ భారత్‌లో 800-1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని తెలుస్తోంది. తన కార్పొరేట్‌ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇండియాలోనూ తొలగింపులు చేపట్టే పనిలో ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, మానవ వనరులు, టెక్‌ విభాగంలో ఈ ఉద్వాసనలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కృత్రిమ మేధాపై భారీగా వ్యయాలు పెంచుతోన్న నేపథ్యంలో సిబ్బందిపై వ్యయాలను పెంచుకోవడం ద్వారా పొదుపు చర్యలకు దిగాలని నిర్ణయించుకుంది. తొలగించిన ఉద్యోగులకు కంపెనీలోనే కొత్త ఉద్యోగావకాశాన్ని వెతుక్కు నేందుకు మూడు నెలల సమయం ఇస్తామని వెల్లడించింది.
అమెజాన్‌ కార్పొరేట్‌ విభాగంలో 3.50 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 4 శాతం మందిని తొలగించడానికి కార్యాచరణ రూపొందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -