- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. గతేడాది అక్టోబర్‌లో 14 వేల మందిని తొలగించిన సంస్థ, తాజాగా 16 వేల కార్పొరేట్ ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీ వెల్లడించారు. 2023 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో లేఆఫ్స్ ఇదే తొలిసారి. కార్పొరేట్ ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐ వినియోగం పెంచాలని అమెజాన్ భావిస్తోంది. విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
- Advertisement -



