Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంట్రంప్‌ కంపెనీతో అంబానీ ఒప్పందం

ట్రంప్‌ కంపెనీతో అంబానీ ఒప్పందం

- Advertisement -

అమెరికా అధ్యక్షుడి వ్యాపార విస్తరణకు సహకారం
న్యూఢిల్లీ :
వ్యాపారవేత్త రాజకీయ నేతగా మారితే తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే చూస్తాడు. ప్రజల్ని కూడా వినియోగవస్తువులుగా చూస్తూ, ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటారనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యక్ష ఉదాహరణ. భారతదేశంలో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన ముఖేష్‌ అంబానీతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార విస్తరణ కోసం ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం డోనాల్డ్‌ ట్రంప్‌ వార్షిక ఆర్థిక నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ అందుకున్న విదేశీ లైసెన్సింగ్‌, అభివృద్ధి రుసుములను వెల్లడించింది. ట్రంప్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థతో 10 మిలియన్‌ డాలర్ల (దాదాపు.86 కోట్లు)కు రిలయన్స్‌ సంస్థకు చెందిన ‘4ఐఆర్‌ రియాల్టీ డెవలప్‌మెంట్‌’ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో అంబానీ ముంబయిలో తమ రాబోయే ప్రాజెక్ట్‌ కోసం ‘ట్రంప్‌’ బ్రాండ్‌ పేరును ఉపయోగించుకుంటారు. అయితే దీనిపై రిలయన్స్‌ సంస్థ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రంప్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముఖేష్‌ అంబానీ, ఆ తర్వాత దోహాలో ఖతార్‌ ఎమిరేట్‌ నిర్వహించిన విందులో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad