నవతెలంగాణ – సదాశివనగర్ : సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామంలో గల అంబరీశ్వర స్వామి పుణ్యక్షేత్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అంబరీశుని గుట్టపై నెల ఆలయంలో ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సంగెo రాజిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి మూడు రోజులపాటు ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యం లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను పత్రిక ద్వారా ఆయన వెల్లడించారు. ఐదవ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు అఖండ దీపారాధన గణపతి పూజ, పుణ్యావచనం, ధ్వజారోహణ, ప్రధాన కలశం, కుంకుమార్చన సాయంత్రం నాలుగు గంటలకు కలశాల ఊరేగింపు. శుక్రవారం ఉదయం గణపతి పూజ నిత్య పూజ కళాశాలతో స్వామివారికి అభిషేకం మండపారాధన శివపార్వతుల కళ్యాణం అనంతరం జీవిత ప్రసాద వితరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం బిల్వ యాత్ర కార్యక్రమం ఉంటుందన్నారు. శనివారం అగ్నిగుండాల కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు . గురువారం సాయంత్రం 6 గంటలకు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ఆవరణలో అన్న ప్రసాద కార్య క్రమం ఉంటుందని తెలిపారు. అంగరంగ వైభవంగా జరిగే వార్షికోత్సవ వేడుకలకు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
రేపటి నుంచి అంబరీశ్వర స్వామి ఆలయ వేడుకలు
- Advertisement -
- Advertisement -



