నవతెలంగాణ – భీంగల్
22 గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భీంగల్ మండలం లింగాపూర్ చౌత్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమనికి సంబంధించి భీంగల్ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ గురువారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రిక్క లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానా చార్యులు ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాశీ ము, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పున్నయ్య తదితరులు పాల్గొననున్నారని శనివారం రోజు పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ప్రజా గాయకులు ఏపూరి సోమన్న కళాబృందం ధూమ్ ధామ్ కార్యక్రమం నిర్వహించ బడును కావున ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన భీంగల్ ప్రాంత అధ్యక్షులు గడల ప్రసాద్, ఐక్య సంఘటన నాయకులు పర్స నవీన్: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య, విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్ గట్టు ఈశ్వర్, సూరి నీడ అశోక్ , బిజెపి భీంగల్ మండల అధ్యక్షుడు ఆరె రవీందర్ , ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరే రమేష్ , భీమ రవీందర్ గిరిజన సంఘ నాయకులు తుక్కాజి నాయక్, గౌడ సంఘం అధ్యక్షులు రామా గౌడ్ బండారి గంగాధర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
22′ న లింగాపూర్ చౌత్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES