Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅంబేద్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

అంబేద్కర్‌ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

- Advertisement -

ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు ఎగ్జామ్స్‌
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో డా.బిఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ భోజు శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న ఎన్నికల కమిషన్‌ మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నందున పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వాయిదా పడిన డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సరాలకు సంబంధించిన వివిధ సెమిస్టర్‌ పరీక్షలను తిరిగి ఈనెల 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. విద్యార్థులు పరీక్ష తేదీకి మూడ్రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్‌ పోర్టల్‌ షషష.bతీaశీబశీఅశ్రీఱఅవ.ఱఅ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సంబంధిత అధ్యయన కేంద్రాలను లేదా విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ షషష.bతీaశీబ.aష.ఱఅను సంప్రదించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -