Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్  పాత్ర అపారం

భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్  పాత్ర అపారం

- Advertisement -

 –  దళిత బహుజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్ర శివరాజ్ 

నవతెలంగాణ –  కామారెడ్డి

భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్  పాత్ర అపారమని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే విలువలను దేశానికి అందించిన మహానుభావుడని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఇంకా దళితులు, బహుజనులు వివక్షకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అంబేద్కర్  ఆశయాలను నిజంగా అమలు చేయాలంటే విద్య, ఉపాధి, భూమి హక్కులు వంటి అంశాల్లో ప్రభుత్వాలు స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.యువత అంబేద్కర్  ఆలోచనలను చదివి, అవగాహన పెంచుకొని సమాజ మార్పుకు కట్టుబడి ఉండాలి. దళిత బహుజనుల ఐక్యతతోనే సమాన హక్కులు సాధ్యమవుతాయి.  అంబేద్కర్  చూపిన మార్గంలో నడుస్తూ సమాన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శివరాములు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -