జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
నవతెలంగాణ – మిడ్జిల్
అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం కుటుంబాన్ని వదులుకొని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు. ఆదివారం మండలంలోని సింగం దొడ్డి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులు ఆచారితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు జగ్జీవన్ రావు పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని నా చేతుల మీదిగా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పేద ప్రజలు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని చెప్పారు. ఆయన రాసిన రాజ్యాంగ పలాలు అణగారిన వర్గాల ప్రజలకు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చారని తెలిపారు.
గ్రామ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, విగ్రహ దాత భాస్కర్,నాయకులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు టైగర్ జంగయ్య మాదిగ,యాదయ్య,విజయకుమార్, సంపత్ కుమార్, వెంకటయ్య, సర్పంచులు అంజన్ రెడ్డి, శంకర్, నాగరాజు గౌడ్, ధర్మ నాయక్, శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ హైమావతి వెంకటయ్య, అంబేద్కర్ కమిటీ సభ్యులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




