Wednesday, December 31, 2025
E-PAPER
HomeNewsసొంత నిధులతో గ్రామానికి అంబులెన్స్

సొంత నిధులతో గ్రామానికి అంబులెన్స్

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి : ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మండలంలోని లింగంపల్లి గ్రామానికి సొంత నిధులతో అంబులెన్స్ సౌకర్యం సమకూర్చారు. లింగంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఇర్ఫాన్ అహ్మద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ ప్రజల సౌకర్యార్థం అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందేందుకు వీలుగా కొత్తగా అంబులెన్స్ ను కొనుగోలు చేసి గ్రామంలో అందుబాటులో ఉంచారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీ ఇచ్చిన నెలలోపే అంబులెన్స్ రావడం ఆనందంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -