- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల జూనియర్ కళాశాలలో బుధవారం రోజు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఏం సి చైర్ పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి సంబరాల్లో పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ ఠాగూర్, ఇమామ్, చంటి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -