నవతెలంగాణ – రాయపోల్
ఎల్కల్ గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ పిట్ల బాలరాజుకు చిరు సన్మానం చేయడం జరిగిందని మాజీ ఏఎంసీ డైరెక్టర్ పబ్బ అశోక్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం నియమించిన దౌల్తాబాద్ రాయపోల్ మండలాల మార్కెట్ కమిటీ సభ్యుల నియామకంలో బేగంపేట రైస్ మిల్ యాజమాని పిట్ల బాలరాజుకు డైరెక్టర్ గా నియమించడం జరిగింది. కాబట్టి గురువారం రాయపోల్ మండలం బేగంపేటలో మర్యాదపూర్వం కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి దౌల్తాబాద్ మండలం పరిధిలోని వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూర్చేలా, ప్రముఖ వ్యాపారవేత్త బేగంపేట్ రైస్ మిల్ నిర్వాహకుడు పిట్ల బాలరాజు ఉమ్మడి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఘనంగా చిరు సన్మానం చేసి అభినందించారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న బాలరాజు రైతుల సంక్షేమానికి, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు .
ఏఎంసీ డైరెక్టర్ ఇట్లా బాలరాజుకు చిరు సత్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



