-న్యూజిలాండ్ మహిళలు రికార్డు ఛేదన
-రెండో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళలపై గెలుపు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డే క్రికెట్‌లో రికార్డు స్కోర్ ఛేదించింది. వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ భారీ లక్ష్యాన్ని కివీస్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ర్(179నాటౌట్; 139బంతుల్లో 23ఫోర్లు, సిక్సర్)కి తోడు ఇసాబెల్లా గాజే(68) బాయటింగ్‌లో రాణించి మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 346పరుగులు చేసింది. బోచ్(91), కెప్టెన్ వోల్వార్డ్(69), ట్రయాన్(52) అర్దసెంచరీలతో రాణించారు. దీంతో వన్డే క్రికెట్‌లో ఆ ఘనత టీమిండియా మహిళల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు కివీస్ పైనే భారత్ 341/5 టార్గెట్‌ను ఛేదించి విజయం సాధించింది. తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది.
చితక్కొట్టిన అమెలియా కెర్
ఓవైపు భారీ లక్ష్యం, ఓపెనర్ల నుంచి మెరుపు ఆరంభమే రాలేదు. కానీ, అమెలియా కెర్ (179నాటౌట్: 139 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడు ప్రదర్శించింది. ఫోర్లతో విరుచుకుపడింది. ఆమెకు తోడుగా ఇసాబెల్లా గేజ్ (68) అండగా నిలిచింది. అయితే, దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభణతో.. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడటంతో కివీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. కానీ, కెర్ మాత్రం పట్టువిడవకుండా చివరివరకూ క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ను ముగించింది. దీంతో కివీస్ చివరికి 49.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా అమెలియా కెర్ నిలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలిచి 1-1తో సమంగా నిలువగా.. ఆఖరి వన్డే ఏప్రిల్ 4న జరగనుంది.
కేక పుట్టించిన అమేలియా
- Advertisement -
- Advertisement -



